సాగునీటి సంఘాలు - మంచీ చెడులు

 నత్త నడకన టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసా గర్ ప్రాజెక్టు ఆర్గనైజేషన్ పరిధిలో సాగునీటి సంఘాల ముసుగులో జరిగిన భారీ అక్రమాలు, అవక తవకలపై ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ బృందాల పనితీరు నత్తన డకన కొనసాగుతోంది. కమిటీల సభ్యులు తమ కార్యాలయాల రెగ్యులర్ పనులు చూసుకుంటూనే శ్రీరాంసాగర్ అక్రమాలపై తనిఖీలు చేయాల్సి ఉంది. దీంతో బృందం సభ్యులు శ్రీరాం సాగర్ అక్రమాల పుట్టను తవ్వడానికి మరో ఏడాది కూడా పట్టే అవకాశం లేకపోలేదని సాగునీటి వర్గాలు అంటు న్నాయి.

మొత్తం శ్రీరాంసాగర్ ఆర్గనైజే షన్ పరిధి సంబంధించి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్ల్లాల్లో దాదాపు 281 కోట్ల రూపాయ ల విలువైన 5680 పనులను నాలుగు టాస్క్ ఫోర్స్ బృందాలు పరిశీలించాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ పసుల కు సంబంధించి 100 కోట్ల రూపాయిల బిల్లులను గత ఏడాది కాలంగా చెల్లిం చడం లేదు.

ఇకపోతే సాగునీటి సంఘా ల ముసుగులో కోట్లాది రూపాయిలు దుర్వినియోగం జరుగడం, అక్రమాలు హైకోర్టు గడపను తాకడంతో అసలు రంగు బయట పడింది. కొన్ని నెలలు గా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో సాగునీటి సంఘాల పేరిట భారీ అక్రమాలు జరు గుతున్నాయని అధికారులు నామినేషన్ పద్దతిలో పనులు కేటాయిస్తూ భారీ అవినీతికి పాల్పడుతున్నారని బాల్కొ ండ నియోజకవర్గ తెలుగు దేశం ఇన్‌చార్జి జి. వసంతరెడ్డి హై కోర్టులో పిటిషన్ వేశారు.

దీంతో గత ఏడాది నవంబర్ 4న హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు గూడ రఘరాం, జ స్టిస్ రమేష్, రంగనాథ్‌లు అక్ర మాలపై విచారణకు ఆదేశించగా విజిలెన్స్ బృందం సభ్యులు విచారణ జరిపి ప్ర భుత్వానికి నివేదిక అందజేశారు. హైకో ర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ విభాగం దర్యాప్తున కు ఆదేశించడం, నవంబర్, డిసెంబర్, మాసాల్లో బృందం నిజామాబాద్, ఆది లాబాద్, వరంగల్ జిల్లాల్లో విస్త్రతంగా పర్యటించడం జరిగింది.

విజిలెన్స్ ద ర్యాప్తునకు ముందే ప్రభుత్వం 10 మం ది ఉన్నతస్థాయి ఇంజనీర్లపై వేటు వేసింది. విజిలెన్స్ నివేదిక అందిన వెంటనే మరో 11 మందిని గత నెల 15న ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఇదివరకే అనేక సాగునీటి సంఘాలు కోట్లాది రూపాయిలతో చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బం దులు పడుతున్నాయి. సాగునీటి సం ఘాల మాటున అనేకమంది రాజకీయ నాయకులు ఉండండంతో బిల్లుల చెల్లిం పునకు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. వ్యవహరంపై కోర్టు పరిధిలో ఉండడంతో బిల్లులు చెల్లింపు పై ప్రభుత్వం తీవ్ర తర్జనభర్జన పడుతో ంది.

అదే పనిగా అధికార పార్టీ నేతలు సైతం పెండింగ్ బల్లుల చెల్లింపుల కో సం పట్టు బడుతుండడంతో సాగునీటి శాఖ ఉన్నతాధికారులు ప్రత్యామ్నయ మార్గాలపై దృష్టి పెట్టింది. దీనికి తోడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆర్గనైజేషన్ పరిధిలో మొత్తం 5680 పనులకు గాను విజిలెన్స్ ఎన్‌ఫోర్ ్స మెంట్ అధికారుల బృందం కేవలం 81 పనులను మా త్రమే తనిఖీ చేసింది. కోర్టుకు పూర్తి స్థా యిలో నివేదిక ఇవ్వాలన్న, బిల్లులు చెల్లింపు చేయాలన్న సాగునీటి శాఖకు తలకు మించిన భారం అవుతుంది.

దీంతో పనుల్లో జరిగిన అక్రమాలపై నిర్ధారణకు ఉన్నతస్థాయి ఇంజనీర్లతో కూడిన 4 టాస్క్‌ఫోర్ ్స కమిటీలను ఏ ర్పాటు చేసింది. ఈ నేపధ్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు పనులను పరిశీ లించి ఇచ్చే నివేదికకు అనుగుణంగా బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ముందుకు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు టాస్క్‌ఫోర్స్ బృం దాలు నిర్ధేశించిన పనుల్లో మొత్తం 2 శాతం పనులను కూడా పరిశీలించ లేక పోయాయి. ఈ లెక్కన టాస్క్‌ఫోర్స్ బృందాల ఇలాగే తనిఖీలు కొనసాగితే మరో నాలుగు నెలల వరకు శ్రీరాం సాగర్ బిల్లుల చెల్లింపులు జరిగే అవ కాశం లేదు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి బడానేతలను నమ్ముకొని పనులు చేప ట్టిన కార్యకర్తలు, సాగునీటి సంఘాల నేతలు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. గత ఏడాది కాలంగా ఒక్క బిల్లు రాక వీరు మానసిక ఆందోళనలో పడ్డారు.

నేతల బేఫికర్..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆర్గనైజేషన్ పరిధిలో సాగునీటి సంఘాల ముసుగు లో జరిగిన భారీ అక్రమాలు, అవకత వకలకు పాత్రదారులు, సూత్రదారులై నా బడా నేతలు ఈ వ్యవహరంలో తాము ఏమీ ఏరగనట్లు వ్యవహరిస్తు న్నారు. మెజారిటీ పనులను అధికార పార్టీ, ప్రతిపక్షం నాయకులు పొందిన ప్పటికీ వారిని నేతలు ఏ మాత్రం పట్టించుకోక పోవడంతో పనులు పొం దిన వారు ఆందోళన చెందుతున్నారు.

అమాయక ఇంజనీర్ల బలి..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆర్గనైజేషన్ పరిధిలో వివిధ జిల్లాల్లో జరిగిన సాగు నీటి పనులకు సంబంధించి క్రింది స్థా యిలో అమాయకులైన ఇంజనీర్లు బలి అవుతున్నారు. కేవలం రైతులకే సాగు నీటి సంఘాలు పరిమిత మని వాలం తరి సంస్థ పలుకులు చెవిలో జోరీగలా వినిపించినా రాజకీయ కబంధ హస్తా ల్లో చిక్కి అవి నిర్వీర్వమయ్యాయి. ఇక పోతే ఇప్పటికే ప్రభుత్వం 21 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది.

విజిలె న్స్ విభాగం తప్పు పట్టిన మరో 60 మంది వ్యవహారాన్ని ప్రభుత్వం సాను కూల అంశంలోకి నెట్టింది. అయితే సాగునీటి అక్రమాలకు సంబంధించి ఏ మాత్రం సంబంధంలేని ఇఇ అనంతరె డ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తనకు జరిగిన అన్యాయంపై ఆయన ఉన్నతాధికారులకు ఆరు నెలల క్రితం పెట్టుకొన్న అర్జీ బుట్టదాఖలయింది. ఇక ఇప్పటి వరకు సస్పెండ్ అయిన 21 మందిలో ఎక్కువ మంది శ్రీరాంసాగర్ జివిసి-1 సర్కిల్‌కు చెందిన వారే కావ డం పట్ల పలు విమర్శలు వెల్లు వెత్తు తున్నాయి.

70నుండి 80 శాతం మంది ఇదే సర్కిల్‌కు చెందిన వారు ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. విజి లెన్స్ విభాగం తప్పపట్టిన పనుల్లో 70 శాతం అక్రమాలు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో జరిగినట్లు నివేదికలు చెప్పుతు న్నాయి. అయితే ఈ అక్రమాలకు బా« ద్యులైన వారిపై, ఇంజనీర్లపై వేటు పడకుండా కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ఇద్దరు, పవర్‌లో ఉన్న మంత్రి ఒకరు అడ్డుపడుతున్నట్లు తెలిసింది.

కనుమరుగైన అసలు సూత్రదారులు
ఎస్సారెస్పీ పరిధిలో జరిగిన అవినీతి అక్రమాలకు కీలక సూత్రదారులైన ఆర్థికశాఖ అధికారులు నానాటికి ఈ కుంభకోణం నుంచి తెరమరుగవు తున్నారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 281 కోట్ల రూపాయిలకు ఆర్ధిక శాఖ అధికారులు ఏ విధంగా క్లియరెన్స్ ఇచ్చారన్నది చేధించలేని ప్రశ్నగా మిగిలింది. ఎవరి ప్రోత్సాహంతో, అండ దండలతో ఈ వ్యవహరం నడిచిందనేది ప్రభుత్వం పెద్దలకే తెలియాలి.

తప్పులు దిద్దుకుంటున్న ఇంజనీర్లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆర్గనైజేషన్ పరిధిలో జరిగిన అవినీతి, అ క్రమాల గుట్టు బయట పడకుండా ఇంజనీర్లు త ప్పులు దిద్దుకుంటున్నారు. ట్రాస్క్‌ఫోర్స్ బృంద సభ్యులు అంగుళం అంగుళం చొప్పున జరిగన పనుల వివరాలను సేకరిస్తున్నారు. దీంతో బెంబేలెత్తిన ఇంజనీర్లు తమ పనుల్లో జరిగిన తప్పులు దిద్దుకుంటున్నారు. ఏ మాత్రం కొలతలు సరిపోక పోయినా ప్యాచ్ వర్క్‌లను ఆఘమేఘాల మీద చేయిస్తున్నారు.

                                                             *** *** ***

నీటి సంఘాల భాగస్వామ్యంపై అసంతృప్తి
వైరా రిజర్వాయర్‌్‌ సాగునీరు పంపిణీ, వినియో గంలోనీటివినియోగదారుల సంఘాల భాగస్వామ్యం పట్ల జలవనరులకు సంబంధించిన ప్రపంచబ్యాంకు మిషన్‌ టీమ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది 22 దేశాల్లో ప్రపంచబ్యాంకు మిషన్‌ టీమ్‌లో జలవనరుల కన్సల్టెంట్‌ అయిన శ్యామ్‌ హెచ్‌ జాన్సన్‌, ఈ టీమ్‌ లో భారతదేశం నుంచి సభ్యుడిగా ఉన్న గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన సాహియాఓజా తదితరులు బుధవారం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో మూడో మీడియం నీటి వినియోగదారుల సంఘంలో సాగునీటి పంపిణీలో సాగునీటి సంఘాల పాత్ర సం బంధాలపై అధ్యయనం చేశారు.

రాష్ట్రంలో నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలోని నీటి సంఘం మధ్యతరహా నుంచి వైరా ప్రాజెక్ట్‌ నీటిసంఘాల పని తీరును అధ్యయనం చేసేందుకు ఆ కమిటీ ఎంపిక చేసుకొని వైరాప్రాజెక్ట్‌కు వచ్చింది. సాగునీటి పంపిణీ లో నీటి సంఘల భాగస్వామ్యంపై సుధీర్ఘంగా ఆ కమిటీ చర్చించింది.  సాగునీరు సరఫరా, పంపిణీ లో వైరా ప్రాజెక్ట్‌ నీటి సంఘాలు వచ్చాక భాగ స్వామ్యం, నిర్వహణపై  వరల్డ్‌ బ్యాంకు మిషన్‌ కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

అనంత రం వైరాలోని ప్రాజెక్ట్‌ కమిటీ కార్యాలయంలో నీటి సంఘాల అధ్యక్షులతో కమిటీ సమావేశమైంది. గత ఏడాది వైరా రిజర్వాయర్‌ ఆయకట్టులో ఏర్పడిన తీవ్ర కరువు గురించి కమిటీ సభ్యులకు సమగ్రంగా వివరించ లేకపోయారు. 80 ఏళ్ళ చరిత్రలో 2009 లో ఖరీఫ్‌లో పంట సాగు చేయలేక పోయారని వివరించారు.రైతులు శిస్తులు రెవిన్యూ శాఖకు చెల్లించకుండా నేరుగా నీటిసంఘలు వసూలు చేసి ఆ నిధులతో మరమ్మతులు చేసే సాధ్యాసాధ్యాలను  సభ్యులు చర్చించారు. ఈ సమావేశంలో ఎంపిపి కట్ట్టా కృష్ణార్జున రావు, పగడవరపు వీరభద్రం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

పిబ్రవరి 24, 2010